వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళి:
YSRCP అధినేత జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా సావిత్రిబాయి ఫూలేను స్మరించుకున్నారు
సామాజిక వివక్షను ఎదిరించి, అక్షరాయుధంతో మహిళా సాధికారతకు బాటలు వేసిన మహనీయురాలు సావిత్రిబాయి ఫూలే అని ఆయన కొనియాడారు.

మహిళల అభ్యుదయానికి విద్యే నాంది అని దృఢంగా నమ్మి, సమాజపు కట్టుబాట్లను ధైర్యంగా ఎదుర్కొంటూ 1848లోనే పూణేలో దేశంలో తొలి బాలికల పాఠశాలను స్థాపించిన భారతదేశపు తొలి మహిళా గురువు, సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే గారు. నేడు ఆ మహనీయురాలి జయంతి సందర్భంగా నివాళులు.ఆమె ఆశయాలకు అనుగుణంగానే గత వైసీపీ ప్రభుత్వంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, అమ్మఒడి, విద్యా దీవెన వంటి పథకాలతో పేద విద్యార్థులకు అండగా నిలిచామని గుర్తుచేశారు.
AP C.M చంద్రబాబు నాయుడు నివాళి:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సావిత్రిబాయి ఫూలే సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు మహిళా విద్య కోసం సావిత్రిబాయి చేసిన పోరాటం మరువలేనిదని, నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే దానికి ఆమె వేసిన పునాదే కారణమని అన్నారు. ప్రభుత్వం తరపున రాష్ట్రవ్యాప్తంగా సావిత్రిబాయి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఏపీలోని పలు ఉపాధ్యాయ సంఘాలు సావిత్రిబాయి ఫూలే జయంతిని (జనవరి 3) “మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా” అధికారికంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు
