పుంగనూరు మండలంలోని మంగళం గ్రామంలోగల శివశక్తి పొదుపు సంఘంలో పెద్ద ఎత్తున నిధుల స్వాహా జరిగింది.
సంఘమిత్రగా ఉన్న లక్ష్మీదేవి తమ గ్రూపు సభ్యులకు తెలియకుండా, వారి ఖాతా నుంచి రూ. 30 లక్షలను మరొక ఖాతాలోకి జమ చేసుకొని స్వాహా చేసినట్లు సంఘం సభ్యులు ఆరోపించారు.
జట్టిగుండ్లపల్లి గ్రామానికి చెందిన శివశక్తి పొదుపు సంఘం సభ్యులు బుధవారం ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, పుంగనూరు పట్టణంలోని శ్రీ శక్తి భవనం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు.
నిందితురాలైన సంఘమిత్ర లక్ష్మీదేవిపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని మహిళలు కోరారు.

