పల్నాడు జిల్లాలో ‘స్ర్కబ్ టైఫస్’ కీటకం ద్వారా వ్యాపించే వ్యాధి లక్షణాలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాధి లక్షణాలతో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతున్నారు.
ముప్పాళ్ళ మండలం రుద్రవరానికి చెందిన యువతి జ్యోతి (20), జ్వరం, ఒంటి నొప్పులతో గుంటూరు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
రాజుపాలెం మండలం ఆర్.ఆర్. సెంటర్‌కు చెందిన నాగమ్మ (62) కూడా స్ర్కబ్ టైఫస్ లక్షణాలతో మరణించింది.
రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన సాలమ్మ (72) కూడా స్ర్కబ్ టైఫస్ లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతి చెందిన ఇద్దరు 20 రోజుల క్రితం జ్వరం, ఒంటి నొప్పులతో ఆస్పత్రిలో చేరారు. వారికి నిర్వహించిన రక్త పరీక్షల్లో స్ర్కబ్ టైఫస్ వ్యాధి లక్షణాలు వెల్లడయ్యాయి.
