నెల్లూరు జిల్లా రాపూరు మండలం పంగిలి గ్రామంలో శుక్రవారం ఉదయం ఘోర విద్యుత్ ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు అగ్నికి ఆహుతవ్వగా, ఇంటి యజమాని తీవ్ర గాయాలపాలయ్యారు.
గ్రామానికి చెందిన మల్లి కోటయ్య తన ఇంట్లో ఉండగా, ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. విద్యుత్ వైరింగ్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలు వ్యాపించడాన్ని గమనించిన కోటయ్య బయటకు వచ్చేలోపే విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు. ఇల్లు కూడా మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు తక్షణమే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. బాధితుడిని తొలుత రాపూరు ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
