శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత, వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
కప్పస్తంభం ఆలింగనం, స్వామివారి దర్శనం అనంతరం పండితులు మంత్రికి వేద ఆశీర్వచనం చేశారు. అధికారులు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. మంత్రి అనిత రాబోయే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. క్యూ లైన్లలో ఉన్న చిన్నారులకు పాలు పంపిణీ చేసి, భక్తులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
“దేముని దయవల్ల ఎన్డీయే కూటమి ఏర్పడిన తరువాత ఆలయాల పరిరక్షణ, ప్రక్షాళనకు నడుంబిగించాం.”ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. భక్తులు ప్రశాంతంగా స్వామిని దర్శించుకొని ఆనందంగా వెళ్ళేటట్లు చర్యలు తీసుకుంటున్నాం.”
విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు వైభవంగా నిర్వహించామని, రాబోయే ప్రధాన ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి అనిత తెలిపారు.
