వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ అమ్మవారి దత్తత దేవాలయం అయిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. నేటి తెల్లవారుజామున 4:30 గంటల నుండి స్వామివారు భక్తులకు అత్యంత పవిత్రమైన ఉత్తర ద్వారం (వైకుంఠ ద్వారం) గుండా దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అర్చకులు స్వామివారికి విశేష అభిషేకాలు, అలంకరణలు నిర్వహించి, హారతిని ఇచ్చారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాల మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
