అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రం శివకోటిలో శివ, కేశవుల కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీరాముడు ప్రతిష్టించిన కోటి లింగాల్లో ఒకటైన శ్రీ ఉమా శివలింగేశ్వర స్వామి వారి కళ్యాణం, అలాగే శ్రీ మేథిని రామ సమేత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం ఏకకాలంలో నిర్వహించడం విశేషం.
శివాలయం ప్రధాన అర్చకులు సన్నిధి రాజు సర్వేశ్వర శర్మ ఆధ్వర్యంలో పండితుల వేద మంత్రాల నడుమ స్వామి వార్ల కళ్యాణ వేడుకలు రమణీయంగా జరిగాయి. ఈ వేడుకలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కోనసీమ నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చి శివ, కేశవుల కళ్యాణాన్ని తిలకించి పులకించారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో, గోవింద నామాలతో మారుమోగింది.
