విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడుకు పార్లమెంట్ వేదికగా అరుదైన గౌరవం దక్కింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కలిశెట్టి పనితీరును మరియు నిరాడంబరతను ప్రత్యేకంగా కొనియాడారు.
పార్లమెంట్ ఆవరణలో తెలుగుదేశం ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కలిశెట్టిని స్పీకర్‌కు పరిచయం చేయబోగా.. “ఆయన నాకెందుకు తెలియదు?” అంటూ స్పీకర్ చిరునవ్వుతో బదులిచ్చారు. గతంలో కలిశెట్టి తనకు ‘అరకు కాఫీ’ అందించిన విషయాన్ని స్పీకర్ గుర్తు చేసుకున్నారు. ఆయన అత్యంత చురుగ్గా ఉంటారని, ప్రతిరోజూ సభకు హాజరవుతారని ఎంపీలందరి ముందు ప్రశంసించారు. పార్లమెంట్‌కు సైకిల్‌పై లేదా సాదాసీదాగా వస్తూ సామాన్యుడిలా ఉండే కలిశెట్టి అందరికీ సుపరిచితులని స్పీకర్ పేర్కొన్నారు. కలిశెట్టి నిబద్ధత ఇతర ఎంపీలకు ఆదర్శమని చర్చించుకోవడం విశేషం.
