AP :కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసిన టీజీ భరత్

November 26, 2025 11:18 AM

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను దిల్లీలో కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

ఓర్వకల్, శ్రీ సిటీ పారిశ్రామిక ప్రాంతాల్లో రైల్వే సైడింగ్‌ల ఏర్పాటు ద్వారా పారిశ్రామిక లాజిస్టిక్స్‌ బలోపేతం చేయడం, పార్కుల పోటీ సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలపై ఆయన చర్చించారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు భరత్ వెల్లడించారు.

అలాగే కర్నూలు–విజయవాడ మధ్య కొత్త రైలు సర్వీస్ అవసరం ఉందని, ఇది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలకు ఎంతో ఉపయోగకరమని వివరించారు. ఈ ప్రతిపాదనపై కూడా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

ప్రస్తావించిన అన్ని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు టీజీ భరత్ తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media