తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పెరుగుతున్న ఎండలు, ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యాశాఖలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మార్చి 16 (సోమవారం) నుంచి రెండు రాష్ట్రాల్లోనూ ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.
మార్చి 16, 2026 ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు. సరిగ్గా 12:30 గంటలకు విద్యార్థులకు భోజనం అందించి ఇంటికి పంపిస్తారు.10th పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1:00 నుండి సాయంత్రం 5:00 వరకు తరగతులు నిర్వహిస్తారు. తెలంగాణలో ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు ప్రకటించారు.ఉక్కబోత, వేడిగాలుల వల్ల విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఏటా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
