మంగళగిరి శివాలయం సమీపంలోని మెట్ల మార్గంలో శ్రీ కాశి అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం జరిపిన అన్నదాన కార్యక్రమం భక్తులతో కిటకిటలాడింది.
ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు స్వయంగా భక్తులకు అన్నప్రసాదం అందించారు. గత 30 నెలలుగా ప్రతి అమావాస్యనాడు 4 వేల మందికి అన్నదానం చేస్తున్నామని, ఇది భక్తుల సహకారం మరియు దాతల ఉదారతతో నిరంతరంగా కొనసాగుతోందని ఆయన తెలిపారు.
మొత్తం 40 మంది దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సాంబశివరావు పేర్కొన్నారు.
“ఆకలితో వచ్చే భక్తులు సంతృప్తిగా వెళ్లడం మా ఆనందం. భక్తుల సేవే పరమార్థం” అని ఆయన అన్నారు.
ఈ సేవా కార్యక్రమానికి స్థానికులు, భక్తులు సాంబశివరావుకు అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో పుప్పాల కోటేశ్వరరావు, గుద్ధంటి మురహరి, కగ్గా శ్రీనివాసరావు, పెరుమాళ్ళ సుబ్రహ్మణ్యం, మారం మల్లికార్జునరావు మరియు ఇతరులు పాల్గొన్నారు.

