AP Endowment: దేవదాయ శాఖ DIGITALIZATION: barcode, scanners upi id పెట్టిస్తున్న ప్రభుత్వం

November 8, 2025 4:22 PM

ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన దేవస్థానాల్లో 100 డిజిటల్ కియోస్క్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ కియోస్క్‌ల ద్వారా దర్శనం, సేవా టికెట్లు, వసతి బుకింగ్స్ వంటి సేవలను భక్తులు సులభంగా పొందగలరు. దీంతో కౌంటర్ల వద్ద రద్దీ తగ్గి భక్తుల సమయం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు.

సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, అరసవిల్లి, మహానంది, కసాపురం, కదిరి లక్ష్మీనరసింహస్వామి వంటి ప్రధాన ఆలయాల్లో ఈ కియోస్క్‌లు ఏర్పాటు చేయనున్నారు. భక్తులు తమ మొబైల్ లేదా ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ అయి అవసరమైన సేవలను పొందవచ్చు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media