నాగలాపురం మండలం: సురుటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి దేవస్థానంలో ప్రోటోకాల్ పాటించకపోవడంపై స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆలయ ఈవో (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) లతను ప్రశ్నించారు.
నామినేటెడ్ పదవులు తాత్కాలికమైనవని, కానీ భారత రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని ఆదిమూలం స్పష్టం చేశారు.
స్వామివారికి పట్టువస్త్రాలు ఎవరు పడితే వారు ఎలా సమర్పిస్తారని, ఆలయ ఈవోగా ఆమె ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
“అంతా ఆ శివుడే చూసుకుంటాడు… మీకు మొట్టికాయలు తప్పవు ఆ శివుడి దగ్గర” అంటూ ఎమ్మెల్యే తనదైన శైలిలో ఈఓను సున్నితంగా మందలించారు.
లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఈ టీడీపీ MLA కోనేటి ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధిష్టానం ఒకప్పుడు సస్పెన్షన్ వేటు వేసింది.ఒకప్పుడు suspend అయినా ఈ mla ఇప్పుడు శివయ్య గురించి ఎత్తడం, అప్పుడు ఈ mla ని మొట్టికాయలు వెయ్యని శివయ్య ఇప్పుడు ఆ ఆలయం EO కి వేస్తారా అనేది వేచిచూడాల్సిన విషయం
