గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై తెనాలి పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి కేసుల్లో పట్టుబడితే ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై వెంటనే రౌడీషీట్ తెరుస్తామని తెనాలి డీఎస్పీ జనార్ధనరావు హెచ్చరించారు.

తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని పాత గంజాయి నేరస్తులకు ఆదివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇకపై గంజాయి జోలికి వెళ్లబోమని నిందితులతో డీఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. ఒకవేళ పద్ధతి మార్చుకోకుండా మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సీఐలు మల్లికార్జునరావు, సాంబశివరావు, నాయబ్ రసూల్ మరియు తెనాలి, కొల్లిపర ఎస్ఐలు పాల్గొన్నారు. పట్టణంలో గంజాయి విక్రయ కేంద్రాలపై నిరంతరం నిఘా ఉంటుందని, యువతను వ్యసనాలకు గురిచేసే వారిని వదిలిపెట్టబోమని అధికారులు తెలిపారు.
