జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలతో పోలీసులకు సవాల్ విసురుతున్న ఘరానా దొంగను తెనాలి వన్ టౌన్ పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ విజయ్ కుమార్ వెల్లడించారు.
గుంటూరు పరమాయకుంటకు చెందిన సయ్యద్ ఖాజా. నిందితుడు తెనాలి వన్ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోనే కాకుండా పాత గుంటూరు, పెదకాకాని మరియు తాడేపల్లి ప్రాంతాల్లోనూ చేతివాటం ప్రదర్శించాడు. ప్రధానంగా ఆటోలు, బైక్లు మరియు సెల్ ఫోన్లనే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఉంచిన వన్ టౌన్ పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేసి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
