తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీగోవిందరాజస్వామి వారి విమాన గోపురం బంగారు తాపడ పనుల్లో ఏకంగా 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలు టీటీడీలో కలకలం రేపుతున్నాయి. బంగారం మాయంపై విజిలెన్స్ విభాగం ఇప్పటికే లోతైన విచారణ ప్రారంభించింది. రికార్డుల్లో ఉన్న బంగారానికి, గోపురానికి వాడిన బంగారానికి పొంతన లేనట్లు గుర్తించారు. గోపురం పనుల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల సుమారు 30 విగ్రహాలు ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది.
వైకాపా హయాంలో తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోళ్లలో అవినీతి వంటి అంశాలు ఇప్పటికే విచారణలో ఉండగా, తాజాగా ఈ గోల్డ్ స్కామ్ బయటపడటం సంచలనంగా మారింది.
ఈ అక్రమాలకు పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.
