ఏర్పేడు మండలం, ముసలిపేడు గ్రామంలోని బతినయ్యకొండ ఆలయానికి వెళ్లిన 22 మంది భక్తులు స్వర్ణముఖి నదిలో చిక్కుకుపోయారు. నది ఉప్పొంగి ప్రవహించడంతో వీరు ప్రమాదంలో పడ్డారు.
జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్, గారి ఆదేశాల మేరకు పోలీసులు తక్షణమే స్పందించారు. ప్రమాదాన్ని లెక్క చేయకుండా పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి, చిక్కుకుపోయిన 22 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
కాపాడిన భక్తులకు ముసలిపేడు ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక పునరావాసం కల్పించారు.
పోలీసుల శ్రమ, సేవాభావాన్ని ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సందేశం ఇస్తూ, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు.
ఆపరేషన్‌లో పాల్గొన్నవారు: ఎస్‌డిపిఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌ఐలు ఇమామ్, వెంకటలక్ష్మి, సిబ్బంది.


