AP టూరిజం అభివృద్ధిపై :CM చంద్రబాబు సమీక్ష

March 25, 2026 2:34 PM

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి N. Chandrababu Naidu కీలక సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదించిన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 2029 నాటికి రాష్ట్రంలో 50 వేల హోటల్ గదుల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాలని, అదేవిధంగా 10 వేల హోం స్టేలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.విశాఖపట్నం, తిరుపతిలో అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటు కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని పేర్కొన్నారు. కారావాన్ టూరిజాన్ని ప్రోత్సహిస్తూ రిజిస్ట్రేషన్లు, పార్కుల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని సూచించారు.అటవీ, దేవాదాయ శాఖల సమన్వయంతో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. PRASAD Scheme, Swadesh Darshan Scheme పథకాల కింద ప్రాజెక్టులను 2026 మే నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.గండికోట, సూర్యలంక, అరకు–బొర్రా గుహలు వంటి ప్రాంతాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. గోదావరి పుష్కరఘాట్, హావ్‌లాక్ బ్రిడ్జిపై పర్యాటకుల అనుమతికి సంబంధించిన పనులను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media