ద్వారకానగర్‌లో వి.జె డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–2 ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం సోమవారం ప్రారంభమైంది. శిబిరాన్ని కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ ప్రెగడ రాజశేఖర్ ప్రారంభించారు. వారం రోజులపాటు సామాజిక సేవా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, విద్యా ప్రచారం చేపడతామని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి గోచిపాత సురేష్ బాబు తెలిపారు.
మొదటి రోజు ‘మహిళా విద్య’పై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథి సుమలత మాట్లాడుతూ మహిళా విద్య కుటుంబాభివృద్ధికి, ఆర్థిక స్వావలంబనకు కీలకమని పేర్కొన్నారు. మరో అతిథి భాను ప్రకాష్, చదువుకున్న మహిళ సమాజ సమస్యలను తగ్గించి మార్పు తీసుకురాగలదని పేర్కొన్నారు.
కరస్పాండెంట్ రాజశేఖర్ మాట్లాడుతూ బేటీ బచావో–బేటీ పడావో, సర్వ శిక్షా అభియాన్, కస్తూర్బా బాలికా విద్యాలయాలు, స్కాలర్షిప్లు వంటి పథకాలను వినియోగించి మహిళా విద్యను ప్రోత్సహించాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాదెళ్ల శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ గంజి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
