చెన్నై-విజయవాడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నరసాపురం వరకు పొడిగించడంతో, ఇకపై గుడివాడ ప్రజలకు హైస్పీడ్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పొడిగింపు రైలు నేడు (డిసెంబర్ 15, 2025) విజయవాడ రైల్వేస్టేషన్‌లో ప్రారంభం కానుంది.
చెన్నై-విజయవాడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20677) ను నర్సాపురం వరకు పొడిగించారు.పొడిగించిన ఈ రూట్‌లో గుడివాడ రైల్వే స్టేషన్‌లో హాల్ట్ ఇచ్చారు. ఆ తర్వాత భీమవరం టౌన్‌లో కూడా ఈ రైలు ఆగనుంది.
నర్సాపురం వరకు పొడిగించిన వందేభారత్ రైలును నేడు (డిసెంబర్ 15న) విజయవాడ రైల్వేస్టేషన్‌లో ప్రారంభించనున్నారు. ఈ పొడిగింపు డిసెంబర్ 17వ తేదీ నుంచి అమలులోకి రానుంది.
షెడ్యూల్ (17 నుంచి): చెన్నైలో ఉదయం 5:30 గంటలకు బయలుదేరి, విజయవాడకు 11:45 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి గుడివాడకు మధ్యాహ్నం 12:30 గంటలకు, భీమవరం టౌన్‌కు 13:15 గంటలకు, నర్సాపురానికి 2:10 గంటలకు చేరుతుంది. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పట్టుబట్టడం వల్లే ఈ అవకాశం గుడివాడ ప్రజలకు దక్కింది.
