ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ఏర్పడనున్న కేతుగ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం దృష్ట్యా, ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రధానాలయం మరియు ఉపాలయాల తలుపులు మూసివేస్తున్నట్లు వైదిక కమిటీ ప్రకటించింది.
గ్రహణ కాలం ముగిసే వరకు ఆలయ ద్వారాలు మూసి ఉంచుతారు. మార్చి 4, బుధవారం తెల్లవారుజామున 03:00 గంటలకు ఆలయ శుద్ధి, స్నపనాభిషేకాలు నిర్వహిస్తారు.బుధవారం ఉదయం 08:30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. మార్చి 4వ తేదీన సుప్రభాతం, వస్త్రం సేవ, ఖడ్గమాలార్చన, నవగ్రహ శాంతి హోమం, గణపతి హోమాలను రద్దు చేశారు.భక్తులు ఈ మార్పులను గమనించి తమ దర్శన సమయాలను ప్లాన్ చేసుకోవాలని ఆలయ అధికారులు కోరారు.
