నగరంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగవరం రామాలయం వీధిలో మూడేళ్ల బాలికపై యోగి (అలియాస్ గాంధీ) అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బిస్కెట్లు కొనిపెడతానని ఆశ చూపి నిందితుడు చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అనంతరం బాలికను ఇంటి వద్ద వదిలివెళ్లగా, చిన్నారి ఏడుపు ఆపకపోవడంతో తల్లి గమనించింది. బాలిక జననాంగం నుంచి రక్తస్రావం అవుతుండటం చూసి ఆందోళన చెందిన తల్లిదండ్రులు, స్థానికుల సమాచారంతో నిందితుడిని గుర్తించారు.బాధితుల ఫిర్యాదు మేరకు న్యూపోర్ట్ పోలీసులు నిందితుడు గాంధీపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
