AP నిజాయితీతోనే విజయం SPEAKER అయ్యన్నపాత్రుడు :MAHARAJA BANK 11వ శాఖ

December 15, 2025 4:35 PM

గత 25 ఏళ్లుగా ఆర్థిక సేవల రంగంలో విశ్వాసాన్ని చూరగొంటున్న మహారాజా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 11వ శాఖను సోమవారం నర్సీపట్నంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఘనంగా ప్రారంభించారు. మహారాజా బ్యాంక్ 11వ శాఖ నర్సీపట్నంలో ప్రారంభమైంది.2000వ సంవత్సరంలో తాను ప్రారంభించిన ఈ బ్యాంక్ నేడు వృక్షమై, ₹500 కోట్ల టర్నోవర్ మరియు 11 శాఖలతో విజయవంతంగా కొనసాగుతోందని స్పీకర్ ప్రశంసించారు.విజయనగరం పూసపాటి రాజవంశీయుల ఆశీస్సులతో, వారి నిజాయితీ, త్యాగాలకు ప్రతీకగా ఈ బ్యాంక్ ప్రజల్లో అపారమైన నమ్మకాన్ని సొంతం చేసుకుందని స్పీకర్ తెలిపారు.

నర్సీపట్నం ప్రాంతం ఏజెన్సీకి ముఖద్వారంగా, EDU హబ్‌గా, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ఈ ప్రాంతంలో బ్యాంక్ సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. మాకవరపాలెం ప్రాంతంలో రాబోయే పరిశ్రమలు, టౌన్‌షిప్‌ల నేపథ్యంలో సామాన్య ప్రజలకు, డ్వాక్రా మహిళలకు, చిన్న వ్యాపారులకు అండగా నిలవాలని బ్యాంక్‌కు సూచించారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, సీఎమ్‌ఆర్ అధినేత మావూరి వెంకటరమణ, వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం. రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media