విశాఖ నగరంలో మంగళవారం ఉదయం పెను ప్రమాదం తృటిలో తప్పింది. కంచరపాలెం సర్వీస్ రోడ్డులో సాయిబాబా ఆలయం సమీపంలో వేగంగా వచ్చిన ఓ జీవీఎంసీ లారీ అదుపు తప్పి బస్టాప్‌ను బలంగా ఢీకొట్టింది.

లారీ ఢీకొట్టడంతో బస్టాప్ షెల్టర్ పూర్తిగా ధ్వంసమైంది. లారీ ఢీకొట్టిన సమయంలో బస్టాప్‌లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో, పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై, లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
