AP:విజయనగరంలో అక్షరాంధ్ర యజ్ఞం

February 6, 2026 11:32 AM

జిల్లాలోని నిరక్షరాస్యులందరూ అక్షరాస్యులుగా మారి విజ్ఞానవంతులు కావాలని జిల్లా కలెక్టర్ ఎస్‌. రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘ఉల్లాస్’ కార్యక్రమంలో భాగంగా విజయనగరం మండలం దుప్పాడ గ్రామంలో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కేంద్రాన్ని గురువారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా సందర్శించారు.

అక్షరాలు నేర్చుకుంటున్న మహిళలతో కలెక్టర్ ముచ్చటించి, వారి అభ్యాస సామర్థ్యాన్ని స్వయంగా పరీక్షించారు. బోధనా పద్ధతులపై వాలంటీర్లకు పలు సూచనలు చేశారు. జిల్లాలో మొత్తం 1,10,915 మందిని అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో 60,715 మంది మహిళలు. పట్టణ ప్రాంతాల్లో 12,000 మంది మహిళలు. 38,200 మంది పురుషులు.లక్ష్యానికి అనుగుణంగా తరగతులు నిర్వహించాలని జిల్లా సమన్వయ కమిటీని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి శ్రీనివాస పాణి, అక్షరాంధ్ర నోడల్ అధికారి వేణుగోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media