అభివృద్ధి చెందుతున్న Vizianagaram నగరంలో చెత్త సమస్య స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. రాజాం ప్రధాన రహదారి సమీపంలోని డోలపేట ప్రాంతంలో రోడ్డు పక్కన చెత్త కుప్పలు పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోంది.
మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సేకరించిన చెత్తను ప్రధాన రహదారిపైనే కుప్పలుగా వేయడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి కాలం కావడంతో చెత్త కుప్పల వల్ల దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు భయపడుతున్నారు.ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని డోలపేట ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త కుప్పలను వెంటనే తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
