పవిత్ర Ramadan మాసం సందర్భంగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కెఎల్‌పురం కమ్యూనిటీ హాలులో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి Kondapalli Srinivas హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇటువంటి ఇఫ్తార్ విందులు సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.జిల్లా కలెక్టర్ S. Ramsundar Reddy మాట్లాడుతూ సమాజంలో మతసామరస్యం కొనసాగాలని, ఖురాన్ బోధనలను ఆచరణలో పెట్టాలని సూచించారు.విజయనగరం ఎమ్మెల్యే Pusapati Aditi Vijayalakshmi Gajapathiraju మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విజయనగరం జిల్లా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.

