AP:రూ. 1200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల

February 12, 2026 6:06 PM

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూ. 1,200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపుతూ విశాఖలో సంబరాలు నిర్వహించారు. వి.ఎం.ఆర్.డి.ఏ (VMRDA) చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ప్రణవ్ గోపాల్ తో పాటు టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు సి.హెచ్. పట్టాభిరామ్, ప్రధాన కార్యదర్శి నొడగల కృష్ణ తదితరులు కలిసి భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. లోకేష్ గారు విద్యార్థుల పక్షపాతి అని, గత ప్రభుత్వం బకాయిలు పెట్టి ఇబ్బంది పెడితే, కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేసి విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కల్పించిందని నేతలు కొనియాడారు.చివరగా గాలిలోకి బెలూన్లు ఎగురవేసి విద్యార్థులు, పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, జనసేన నాయకులు, టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు మరియు పెద్ద ఎత్తున విద్యార్థినులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media