ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు లోక్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను కలిశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరుతూ ఆయన వినతి పత్రం అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సేకరించిన కోటి సంతకాల ప్రతులను వైఎస్ జగన్ గవర్నర్‌కు సమర్పించారు. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. జగన్ వెంట శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మరియు ఇతర పార్టీ కీలక నేతలు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. 17 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల పేదలకు వైద్యం, విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని జగన్ గవర్నర్‌కు వివరించారు.ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలిపివేసేలా ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని ఆయన విన్నవించారు
