విహారయాత్రకు వెళ్లిన గీతం యూనివర్సిటీ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట మండలం రాళ్లగడ్డ బ్రిడ్జి వద్ద జరిగిన ఈ ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

హుకుంపేట మండలం, రాళ్లగడ్డ బ్రిడ్జి సమీపంలో, మృతి చెందిన యువకుడు నెల్లూరు జిల్లాకు చెందిన రుద్ర. ఇతను గీతం యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నాడు.అతి వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి బ్రిడ్జిని బలంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.కారులో మొత్తం ఐదుగురు ప్రయాణికులు ఉండగా, రుద్ర మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
డీఎస్పీ, సీఐ సన్యాసినాయుడు, ఎస్సై సూర్యనారాయణ ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
