ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గంలో విశేష స్పందన లభించింది.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి మరియు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జోరుగా సాగుతోంది.మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటికే 70 వేలకు పైగా సంతకాలు సేకరించి, వాటిని డిజిటలైజేషన్ చేశారు. ప్రజల స్వచ్ఛంద స్పందన చూస్తుంటే, కూటమి ప్రభుత్వంపై ఏడాదిన్నరకే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని వేమారెడ్డి, హనుమంతరావు తెలిపారు. ప్రభుత్వం వెంటనే వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
సేకరించిన పత్రాలను బుధవారం జిల్లా అధ్యక్షులకు అందజేయనున్నారు. ఈ నెల 15న గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
