రెచ్చిపోయిన అర్జున్ టెండూల్కర్

June 9, 2026 7:53 AM
arjun tendulkar innings

అర్జున్ టెండూల్కర్ ముంబై టి20 లీగ్‌ (Mumbai T20 League)లో సంచలన ప్రదర్శనతో అదరగొట్టాడు. బాంద్రా బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంధేరి టీమ్ తరపున బరిలోకి దిగిన అర్జున్, అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో అద్భుతమైన ఆల్‌రౌండ్ షోతో జట్టును ఒంటిచేత్తో మ్యాచును గెలిపించాడు.

మొద‌ట బౌలింగ్‌లో మూడు వికెట్లు (3-1-11-3) తీసిన అర్జున్ టెండూల్కర్. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌లో వ‌న్‌డౌన్‌లో వ‌చ్చి 34 బంతుల్లోనే 66 ప‌రుగులు అజేయ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ ను ముగించాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్స‌ర్లు ఉన్నాయి. అర్జున్ మ్యాచ్‌లో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కించుకున్నాడు. అర్జున్ విధ్వంసంతో అంధేరీ 145 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 13.5 ఓవ‌ర్ల‌లోనే ఒక్క వికెట్ మాత్ర‌మే కోల్పోయి ఛేదించింది. ఓపెన‌ర్ ముషీర్‌ఖాన్ (38 బంతుల్లో 58 నాటౌట్‌) కూడా రాణించాడు. అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన బాంద్రా బ్లాస్ట‌ర్స్ అర్జున్ టెండూల్క‌ర్ ధాటికి 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 144 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media