218 మంది అభ్యర్థులు షార్ట్‌లిస్ట్.. సికింద్రాబాద్‌లో ఆర్మీ జాబ్ డ్రైవ్

August 21, 2026 5:07 PM
Candidates attending Army job drive at Secunderabad Military Station

26 కంపెనీలు.. 497 మందికి ఇంటర్వ్యూలు
తుది ఎంపికకు 218 మంది.. 2-3 వారాల్లో ఆఫర్ లెటర్లు

హైదరాబాద్: వీర్ నారీస్, మాజీ సైనికుల కుటుంబ సభ్యులు, విధవలు, సర్వీసులో ఉన్న సైనికుల కుటుంబ సభ్యులు, ఫ్రెష్ గ్రాడ్యుయేట్ల కోసం సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్‌లో జాబ్ డ్రైవ్(Army job drive) నిర్వహించారు.

Army Welfare Placement Organisation (AWPO) ఆధ్వర్యంలో, HQ Telangana and Andhra Sub Area (TASA) నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.

పలు ప్రముఖ కంపెనీల భాగస్వామ్యం

Magic Bus, Air India SATS, Fractal, WIPROతో పాటు మరో 22 ప్రముఖ ప్రైవేట్, MNC కంపెనీలు జాబ్ డ్రైవ్‌లో పాల్గొన్నాయి.

HQ TASA, AWWA డిప్యూటీ చైర్‌పర్సన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పాల్గొన్న కంపెనీలు, జాబ్ డ్రైవ్ నిర్వహణ తీరుపై AWPO డైరెక్టర్ ఆమెకు వివరించారు. అనంతరం ఆమె అభ్యర్థులతో మాట్లాడారు. అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకుని దేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని ప్రోత్సహించారు.

497 మందికి ఇంటర్వ్యూలు

జాబ్ డ్రైవ్‌లో మొత్తం 26 MNC, ప్రైవేట్ కంపెనీలు పాల్గొన్నాయి. 497 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీరిలో 45 మంది వీర్ నారీస్, మహిళా అభ్యర్థులు ఉన్నారు.

తుది ఎంపికకు 218 మంది

జాబ్ డ్రైవ్‌లో 218 మంది అభ్యర్థులు వివిధ కంపెనీల తుది ఎంపికకు షార్ట్‌లిస్ట్ అయ్యారు. వీరిలో 27 మంది వీర్ నారీస్, మహిళా అభ్యర్థులు కాగా, 191 మంది పురుష, మహిళా ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు.

తుది ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక వచ్చే 2-3 వారాల్లో ఆఫర్ లెటర్లు జారీ చేసే అవకాశం ఉంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media