కడప జిల్లా పోరుమామిళ్ల మండలం తిమ్మారెడ్డి పల్లె పంచాయతీలో ఆశా వర్కర్ నియామకంపై వివాదం నెలకొంది. తోకలపల్లె గ్రామానికి చెందిన ఇండ్ల కవిత అనే ఎస్సీ మహిళ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ న్యాయం చేయాలని కోరింది.
తమ గ్రామంలో గతంలో ఎస్సీ మహిళ ఆశా వర్కర్‌గా పనిచేసినప్పటికీ, ప్రస్తుతం అదే వర్గానికి చెందిన మహిళను కాకుండా ఇతర సామాజిక వర్గానికి చెందిన మహిళను నియమించారని ఆమె ఆరోపించింది. అలాగే నియమిత మహిళ స్థానికురాలు కాదని, రేషన్ కార్డు ఇతర జిల్లాకు చెందినదని పేర్కొంది.గ్రామ జనాభా ప్రమాణాలు పాటించకుండా నియామకం జరిగిందని, రాజకీయ ప్రభావం మరియు డబ్బుల ఆధారంగా ఈ నియామకం జరిగిందని ఆరోపించింది.ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపిన కవిత, సమగ్ర విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని కోరింది.
