దేశంలో మళ్లీ ఎన్నికలు ఏప్రిల్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ పోరు?

February 18, 2026 11:29 AM

దేశంలో మరో కీలక ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీల గడువు ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో, ఏప్రిల్ నెలలో పోలింగ్ నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) సన్నాహాలు చేస్తోంది.

పశ్చిమ బెంగాల్: మే 7, 2026

తమిళనాడు: మే 10, 2026

అస్సాం: మే 20, 2026

కేరళ: మే 23, 2026

పుదుచ్చేరి: జూన్ 15, 2026

మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అస్సాంలో ఈసీ బృందం పర్యటిస్తుండగా, త్వరలో బెంగాల్, తమిళనాడులలో పర్యటించనుంది. ఫిబ్రవరి 27లోగా అధికారుల బదిలీలు పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. తమిళనాడు తుది జాబితా నేడు (ఫిబ్రవరి 17) విడుదల కాగా, కేరళలో ఫిబ్రవరి 21న, బెంగాల్‌లో ఫిబ్రవరి 28న విడుదల కానున్నాయి.బెంగాల్‌లో బహుళ దశల్లో, మిగిలిన రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ జరిగే ఛాన్స్ ఉందని సమాచారం.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media