కోనసీమ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆత్రేయపురంలో నిర్వహిస్తున్న ‘సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ’ డ్రాగన్ పడవల పోటీలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సోమవారం జరిగిన ఈ పోటీలను అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అమలాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ (ఆముదా చైర్మన్) సోంబాబు, టీడీపీ నాయకుడు మెట్ల రమణబాబు సందర్శించారు.

కేరళలోని పున్నమడ కాయల్ తరహాలో గోదావరి పాయలపై జరుగుతున్న ఈ పోటీలను చూసి అతిథులు ఆనందం వ్యక్తం చేశారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అతిథులకు సాదర స్వాగతం పలికి, డ్రాగన్ పడవల పోటీల విశిష్టతను, క్రీడాకారుల నైపుణ్యాన్ని వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మరియు ఇతర నాయకులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు.కోనసీమ సంస్కృతిని, సాహస క్రీడలను ప్రోత్సహించేలా ఈ పోటీలు నిర్వహించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
