నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను అందించే లక్ష్యంతో అవంతి రీసెర్చ్ అండ్ టెక్నాలజికల్ అకాడమి బోగాపురం క్యాంపస్లో భారీ జాబ్ మేళా నిర్వహించారు.

అవంతి కళాశాల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీవీఎస్, ఫాక్స్కాన్, అపోలో టైర్స్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి సుమారు 15 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి.ఈ జాబ్ మేళాలో 500 మంది నిరుద్యోగులు హాజరుకాగా, అర్హత సాధించిన 200 మందికి నియామక పత్రాలను అందజేశారు. ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అవంతి శ్రీనివాసరావు సూచించారు.
