హిందూపురంలో JCB నడిపిన బాలయ్య: JaiBalayya

February 19, 2026 12:33 PM

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గ పర్యటనలో మరోసారి తనదైన శైలిలో సందడి చేశారు. లేపాక్షి మండలం మానేపల్లి నుండి గౌరిగానపల్లి వరకు రూ. 2.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు ఆయన భూమి పూజ చేశారు.

భూమి పూజ అనంతరం బాలయ్య అందరినీ ఆశ్చర్యపరుస్తూ జేసీబీ (JCB) ఎక్కారు. స్వయంగా జేసీబీని డ్రైవ్ చేస్తూ రోడ్డు పనులను ప్రారంభించారు. బాలయ్య జేసీబీ నడుపుతున్న దృశ్యాలను చూసి కార్యకర్తలు, అభిమానులు కేరింతలు కొట్టారు. అంతకుముందు నియోజకవర్గానికి చేరుకున్న ఆయనకు తెలుగుదేశం మరియు కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎప్పుడూ ముందుంటానని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media