కాంగ్రెస్‌ది ‘రాజకీయ వ్యభిచారం’ : బండి సంజయ్ నిప్పులు

February 4, 2026 3:52 PM

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు.

“ఫిరాయింపు ఎమ్మెల్యేలు గాంధీ భవన్‌లో సంసారం చేస్తూ, కాంగ్రెస్ బి-ఫారాలు పంచుతుంటే.. వాళ్లు పార్టీ మారలేదని స్పీకర్ తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే” అని మండిపడ్డారు. స్పీకర్ గారు తన పదవికి మచ్చ తెచ్చుకోవద్దని హితవు పలికారు. సిరిసిల్లలో కేటీఆర్ ఓటుకు రూ. 10 వేలు పంచుతున్నారని ఆరోపించారు. “కేటీఆర్.. నా జోలికొస్తే నీ నీచ పనులన్నీ బయటపెడతా, నీ బతుకును రోడ్డుకీడుస్తా” అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సిరిసిల్ల అభివృద్ధికి అమృత్ పథకం ద్వారా రూ. 50 కోట్లు, మున్సిపాలిటీకి రూ. 29 కోట్లు కేంద్రం ఇచ్చిందని, ఆ నిధులను ఇక్కడి నేతలు కమీషన్ల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వం వద్ద నయాపైసా లేదని, కేంద్రం ఇచ్చే నిధులను కూడా దారి మళ్లిస్తున్నారని విమర్శించారు.
“డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి.. కానీ ఓటు మాత్రం కమలం పువ్వుకే వేసి సిరిసిల్ల మున్సిపాలిటీని బీజేపీకి అప్పగించండి” అని ప్రజలకు పిలుపునిచ్చారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media