సోలార్‌పై ప్రజాప్రతినిధులు ఆదర్శం కావాలి: Bandi Sanjay Kumar

March 28, 2026 1:31 PM

Karimnagarలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి Bandi Sanjay Kumar తన నివాసంపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు తమ ఇళ్లపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా కోటి ఇండ్లపై సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం PM Surya Ghar Muft Bijli Yojanaను ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలనే ఉద్దేశమన్నారు.సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు సబ్సిడీతో పాటు 80 శాతం వరకు లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని, పేదలకు సైతం భారం లేకుండా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.విద్యుత్ కొనుగోలు చేసే స్థాయి నుంచి అమ్మే స్థాయికి ప్రజలు ఎదగాలని ప్రధాని Narendra Modi ఆకాంక్షగా పేర్కొన్నారు.రైతుల కోసం PM KUSUM Scheme ద్వారా అదనపు విద్యుత్ ఉత్పత్తి చేసి డిస్కంలకు విక్రయించే అవకాశముందని తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media