Bangladesh:బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఎన్నికల్లో పోటీకి సిద్ధం

October 30, 2025 11:46 AM

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీలో తాను స్వేచ్ఛగా జీవిస్తున్నానని, కానీ కుటుంబంపై జరిగిన దాడుల నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపారు. విద్యార్థుల ఆందోళనల కారణంగా గత సంవత్సరం ఆగస్టు 5న పదవి నుంచి తప్పుకున్న ఆమె, అప్పటి నుంచి ఢిల్లీలోనే నివసిస్తున్నారు.

బుధవారం మీడియా ముందుకు వచ్చిన హసీనా, వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో జరగనున్న జాతీయ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు తమ పార్టీ పోటీ చేయకపోతే లక్షలాది మంది మద్దతుదారులు ఎన్నికలను బహిష్కరిస్తారని తెలిపారు. రాజ్యాంగబద్ధ పాలన, రాజకీయ స్థిరత్వం కోసం తమ పార్టీ అధికారంలోకి రావడం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.యూనస్(present Bangladesh pm) ప్రభుత్వం తమపై చేసిన ఆరోపణలను హసీనా ఖండించారు. “నన్ను రాజకీయంగా బలహీనపరచడానికే ఆ ఆరోపణలు చేశారని” పేర్కొన్నారు. కోర్టులు తనకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కేసులు నమోదు చేశాయని ఆమె విమర్శించారు.భవిష్యత్తులో అధికారం చేపట్టడానికైనా లేదా ప్రతిపక్ష పాత్రలోనైనా పనిచేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని షేక్ హసీనా స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media