IPL 2026 ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు ఊహించని పరిణామం ఎదురైంది. మినీ వేలంలో భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుండి విడుదల చేయాలని బీసీసీఐ (BCCI) కోరింది. బీసీసీఐ జాయింట్ సెక్రటరీ దేవాజిత్ సైకియా ఈ విషయాన్ని ధృవీకరించారు.

డిసెంబర్ 16న జరిగిన వేలంలోKKR ఇతడిని ₹9.20 కోట్లకు దక్కించుకుంది. ఇప్పుడు ముస్తాఫిజుర్ జట్టుకు దూరం కావడంతో,KKR యాజమాన్యం ప్రత్యామ్నాయ ఆటగాడి కోసం వెతుకులాట ప్రారంభించింది.
