బీహార్‌లో పోలీసు సిబ్బంది తిలకం లేదా చందనం ధరించకూడదని డీజీపీ Vinay Kumar జారీ చేసినట్లు వార్తలు రావడంతో వివాదం చెలరేగింది.
ఈ ఆదేశాల ప్రకారం, డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బంది ఎవరూ తిలకం లేదా చందనం ధరించకూడదని, ఉల్లంఘిస్తే సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.ఈ నిర్ణయంపై హిందూ సంఘాలు తీవ్రంగా స్పందిస్తూ, ఇది మత స్వేచ్ఛకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని వర్గాలు నిరసనగా అన్ని పోలీసు సిబ్బంది తిలకం ధరించి విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చాయి.అయితే ఈ ఆదేశాలపై అధికారిక స్పష్టత కోసం వేచి చూడాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఘటన రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
