ముజఫ్పూర్లోని ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్, ఆర్జేడీపై తీవ్ర విమర్శలు చేశారు. “ఓటు కోసం చత్థి మైయ్యను అవమానిస్తున్నారు” అన్నారు. చత్థ్ పండుగకు యునెస్కో వారసత్వ గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.అక్టోబర్ 30, 2025 న ఆయన బీహార్‌లో రెండు ర్యాలీలను నిర్వహిస్తారని, ఓటర్లు బీజేపీ-ఎన్డీఏకు ఘన విజయం అందిస్తారని తెలిపారు. ఇక రాహుల్ గాంధీ నలందా, షేక్‌పురా లో, అమిత్ షా లఖిసరాయ్, ముంజర్, నలందా, పట్నా జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించనున్నారు.అమిత్ షా RJD-కాంగ్రెస్ పై ఆరోపిస్తూ, “లాలు ప్రసాద్ కుమారుడు తేజస్వీని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు, సోనియా గాంధీ రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కోరుతున్నారు, కానీ రెండు పదవీలు ఖాళీగా లేవు” అన్నారు.ఇదిలా, RJD నేత తేజస్వీ యాదవ్ మానిఫెస్టోలో ప్రతిజ్ఞలు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినప్పుడు నెరవేరుతాయని హామీ ఇచ్చారు.
Bihar: బీహార్ ఎన్నికల్లో మోడీ, షా RJD-కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు
