బిహార్ ప్రభుత్వం కొత్త సంక్షిప్త పథకాలతో రైతులు, యువత, మహిళలు, ఈబీసీలకు ఆర్థిక సాయం అందించనుంది. కర్పూరి ఠాకూర్ కిసాన్ సమ్మాన్ పథకం కింద రైతులకు రూ.6 వేల బదులు రూ.9 వేల సాయం, ఏడాదికి మూడు విడతలుగా. కోటి ఉద్యోగాల సృష్టి లక్ష్యంతో పరిశ్రమలు, ఐటీ పార్కులు, స్టార్ట్అప్ కేంద్రాలు, కొత్త రోడ్డు-రైల్వే ప్రాజెక్టులలో స్థానిక యువతకు ప్రాధాన్యత.మహిళల ఆర్థిక శక్తివంతం: ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద కోటి మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దడానికి చిన్న వ్యాపార రుణాలు, నైపుణ్య శిక్షణ, మార్కెట్ లింకేజీ, డిజిటల్ అవగాహన.ఈబీసీలకు ఆర్థిక సాయం, ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం, సంప్రదాయ వృత్తులను ఆధునిక పద్ధతులతో మిళితం. రోడ్లు, రైళ్లు, పట్నా మెట్రో విస్తరణ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ద్వారా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు.
Bihar:బిహార్ ప్రభుత్వం రైతులు, యువత, మహిళల కోసం పథకాలు ప్రకటించింది
