న్యూఢిల్లీ కేంద్రంగా తీవ్ర రాజకీయ దుమారం..
ఫోరెన్సిక్ నివేదికపై ఆరోపణలు, దర్యాప్తు డిమాండ్.
న్యూఢిల్లీ : PUNJAB ముఖ్యమంత్రి భగ వంత్ సింగ్ మాన్ కు కష్టాలు మొదలయ్యాయి. సిక్కు ల అత్యున్నత సంస్థ అకాల్ తక్త్ కఠిన తీర్పు పరిణామాలను ఎదుర్కుంటుండగా…తాజాగా BJP ఆయనపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. సిక్కు గురువుల చిత్రాలపై మద్యం చల్లుతున్నట్లుగా కనిపించే ఒక వీడియోకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను ముఖ్యమంత్రి తారుమారు చేశారని ఆరోపిస్తోంది.
నకిలీ వీడియోను తయారు చేయించేందుకు రూ.10 లక్షలు చెల్లించారనే ఆరోపణల నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్పై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి, భగవంత్ మాన్ను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో నకిలీ వీడియోలను రూపొందించి ప్రచారం చేశారనే అంశంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పుడు సమాచార ప్రచారం ప్రమాదకరమని బీజేపీ పేర్కొంది.
అయితే ఈ ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), PUNJAB ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన కోసం రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఆరోపణల నిజానిజాలను దర్యాప్తు సంస్థలు నిర్ధారించిన తరువాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.



