Begumpetలో మంగళవారం రాత్రి సంచలనం చోటుచేసుకుంది. బిజీ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఒక BMW car అకస్మాత్తుగా మంటలు అంటుకుంది.
లైఫ్‌స్టైల్ బిల్డింగ్ సమీపానికి చేరుకున్న సమయంలో కార్ ఇంజిన్ భాగం నుంచి మంటలు కనిపించడంతో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు వెంటనే వాహనం దిగిపోయారు. కొద్ది నిమిషాల్లోనే మంటలు కార్ ముందుభాగాన్ని పూర్తిగా చుట్టుముట్టాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అరగంటలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.ఈ ఘటన కారణంగా రోడ్డుపై ట్రాఫిక్‌కు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. పోలీసులు క్రేన్ సహాయంతో కాలిన కారును తొలగించి ట్రాఫిక్‌ను సవ్యంగా మార్చారు.ప్రాథమికంగా బ్యాటరీ లేదా ఎలక్ట్రికల్ వైర్లలో అధిక వేడి కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు తెలిపారు.
