జమ్మూ & కాశ్మీర్(j&k), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) మరియు స్థానిక అధికారుల సంయుక్త చర్యలో ఫరీదాబాద్‌లో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు.దొరికిన
మొదట 350 కిలోల ఆర్‌డీఎక్స్ స్వాధీనం అయ్యిందని సమాచారం వెలువడినప్పటికీ, అది వాస్తవానికి అమోనియం నైట్రేట్ అని ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ సతేందర్ గుప్తా వెల్లడించారు.
ధౌజ్ గ్రామంలోని ఒక అద్దె ఇల్లులో పోలీసులు దాడి చేసి ఈ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు:
14 సంచుల అమోనియం నైట్రేట్ (సుమారు 100 కిలోలు)
ఒక ఏకే-47 తుపాకీ, 84 లైవ్ కార్ట్రిడ్జీలు
టైమర్లు, రసాయన ద్రావణం, మరియు ఐఈడీ తయారీకి ఉపయోగించే 48 వస్తువులు
అధికారుల ప్రకారం, ఈ పేలుడు పదార్థాలతో ఎక్కువ తీవ్రత గల ఐఈడీలు (IEDs) తయారు చేయవచ్చు, ఇవి విపరీత నష్టం కలిగించే శక్తి కలిగినవి.
ఉగ్రవాదులలో హైదరాబాద్ కి చెందిన వారు ఉండడం గమనార్హం,ఈ ఘటనపై వివరమైన మీడియా సమావేశం త్వరలో నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.

