జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠం నూతన మఠాధిపతుల పట్టాభిషేక మహోత్సవాలు మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

నూతన మఠాధిపతులు పూజ్యశ్రీ శ్రీశ్రీశ్రీ వీర ధర్మజ వేంకటాద్రి స్వాములవారు మరియు వారి ధర్మపత్ని శ్రీమతి ఉమాదేవి అమ్మగారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సజీవ సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్వపు మఠాధిపతులు పూజ్యశ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. మఠాధిపతుల పట్టాభిషేక వేడుకల నేపథ్యంలో కందిమల్లయపల్లి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. బ్రహ్మశ్రీ వడ్లమాని జగదీశ్వర్ (JSR) ఆధ్వర్యంలో ఈ ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయి.ఈ వేడుకల సందర్భంగా మఠం పరిసర ప్రాంతాల్లో వేదమంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

