నెల్లూరు జిల్లా రాపూరులో జనగణన కార్యక్రమంపై శిక్షణా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ పీ. లక్ష్మీనరసింహం మాట్లాడుతూ జనగణన దేశ నిర్మాణంలో అత్యంత కీలకమైన ప్రక్రియ అని తెలిపారు.
భారత ప్రభుత్వం చేపట్టనున్న 16వ జనగణనలో ప్రతి వ్యక్తిని ఖచ్చితంగా లెక్కించడం అవసరమన్నారు. ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడుతుందని తెలిపారు. అక్షరాస్యత, లింగ నిష్పత్తి, జనాభా వంటి కీలక సమాచారం జనగణన ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని ఎన్యూమరేటర్లకు సూచించారు.
